వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు ఎంఎస్పీగా చెల్లింపులు జరిపినట్లు పేర్కొన్నారు. 8,401 పీపీసీలు దాటి 7.5 లక్షల మంది రైతులకు లాభం చేకూరిందన్నారు. 1.26 లక్షల సిబ్బందిలో పనిలో నిమగ్నమై ఉన్నారు.
అందులో 45% ఐకేపీ మహిళలు ద్వారా కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మహిళల సాధికారత పట్ల తెలంగాణ కట్టుబాటుకు ఇది నిదర్శనం అని రాసుకొచ్చారు. సన్నరకం కోసం రూ.314 కోట్లు బోనస్ చెల్లించాం. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే 11.2 లక్షల టన్నుల వరి కొనుగోలు, రూ.2,830 కోట్లు 1.7 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు తెలిపారు. తెలంగాణ పనిభారం, వ్యవస్థ AP కంటే 4 రెట్లు పెద్దది. రైతే మొదటి ప్రాధాన్యం… తెలంగాణ రైజింగ్..అంటూ మంత్రి ఉత్తమ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.