బీఆర్ఎస్ ను వీడడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధం

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఘోరంగా విఫలమవుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  6 April 2024 8:15 PM IST
బీఆర్ఎస్ ను వీడడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధం

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఘోరంగా విఫలమవుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు వచ్చేందుకు సిద్ధమయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరో రెండు నెలల్లో కాంగ్రెస్‌లో చేరతారని అంచనా వేస్తున్నామని.. బీఆర్ఎస్ నాయకత్వంపై ఎమ్మెల్యేకు ఏ మాత్రం నమ్మకం లేదని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఏప్రిల్ 6, శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే అసెంబ్లీలో BRS బలం 108 నుండి 39 కి తగ్గిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌ను పాతాళంలోకి తీసుకుని వెళుతుందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో పడతారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని, అయితే కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ గూటికి చేరాలనే ఉద్దేశంతో ఉన్నారని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Next Story