బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలి : మంత్రి ఉత్తమ్

మేడిగ‌డ్డ‌ బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయ‌న బుధ‌వారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  6 March 2024 4:34 PM IST
బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలి : మంత్రి ఉత్తమ్

మేడిగ‌డ్డ‌ బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయ‌న బుధ‌వారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సమస్యకు కారణం ఎవరు అనేది అడిగాం.. వర్షాలు రాకముందే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌న్నారు. బ్యారేజీలు రిపెర్స్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. సాధ్యాసాధ్యాలు చెప్పండన్నారు. NDSA కమిటీకి పూర్తి సహకారం ఉంటుందన్నారు.

ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ NDSA కమిటీకి ఇవ్వాలని కోరుతున్నామ‌న్నారు. ఎవరైనా NDSA కమిటీకి సహకారం ఇవ్వకపోతే.. డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే కమిటీ వచ్చినట్లు చెప్పారు. రేపు ఉదయం మేడిగడ్డ, అనంతరం అన్నారం, రేపు రాత్రి రామగుండం, 8న సుంధిల్ల బ్యారేజి విసిట్ ఉంటుందని తెలిపారు.

టెస్టుల కోసం ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సుచించామ‌న్నారు. రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదన్నారు. వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిదన్నారు. ENC నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విసిట్ పూర్తి చేసుకుంటుందని తెలిపారు.

NDSA ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. L AND T రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోంది. మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామ‌న్నారు. నిర్మాణ సంస్థకు భాధ్యత ఉండాలన్నారు. జ్యూడీషియ‌ల్‌ ఎంక్వైరీపై త్వరలోనే ముందడుగు ఉంటుందన్నారు.

Next Story