Telangana: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. ఆ తేదీ లోపు రైతు రుణమాఫీ

రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 9వ తేదీ లోపు రైతు రుణామఫీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

By అంజి
Published on : 10 Nov 2024 7:03 AM IST

Agriculture Minister, Tummala Nageswara Rao, farmers, loans, Telangana

Telangana: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. ఆ తేదీ లోపు రైతు రుణమాఫీ 

హైదరాబాద్‌: రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 9వ తేదీ లోపు రైతు రుణామఫీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా రామన్నపేటలో కొత్త మార్కెట్‌ భవనాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్లే సహకార సంఘాలు పూర్తిగా నష్టపోయాయని అన్నారు. తమ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజాను కొనుగోలు చేస్తుందన్నారు. అయితే రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు ఇబ్బంది పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు. వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్లతో మాట్లాడి వారికి మిల్లింగ్ ఛార్జీలు పెంచామన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ రుణమాఫీ చేశామన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story