హైదరాబాద్: చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 190 చేనేత సంషఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం, పొదుపు పథకంలో నిధుల జమపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
అటు వ్యవసాయరంగంలో కొత్త టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టంచేశారు. గురువారం నాడు సచివాలయంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎండీహెచ్‌ఏఐ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కంపెనీ ప్రతినిధులు స్మార్ట్ అగ్రికల్చర్, ఏఐసెన్సార్, ఆటోమెషిన్ పద్ధతులు, డిజిటల్ రేయిన్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రిట్‌మెంట్ గురించి మంత్రికి వివరించారు. తెలంగాణలో వీటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనికి స్పందించిన తుమ్మల తమ అధికారులకు పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.