రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది ఆయ‌నే : మంత్రి తుమ్మల

1982 నుంచి రాజకీయాలలో నా చెయ్యి పట్టుకొని నడిపించింది జానారెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది జానారెడ్డేన‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు

By Medi Samrat  Published on  16 Oct 2024 3:24 PM IST
రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది ఆయ‌నే : మంత్రి తుమ్మల

1982 నుంచి రాజకీయాలలో నా చెయ్యి పట్టుకొని నడిపించింది జానారెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది జానారెడ్డేన‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిడమానూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగానికి అనుగుణమైన పరిపాలన అందిస్తున్నామ‌న్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు చిన్నాభిన్నమైనాయని.. పరిపాలన గతితప్పిందన్నారు.

SLBC రెండేడ్లలో పూర్తి చేసి తీరుతామ‌ని వెల్ల‌డించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. రెండు లక్షల రుణమాఫీని దీపావళి వరకు పూర్తిచేస్తామ‌న్నారు. ధాన్యం అమ్మకాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం అన్నారు. ఇచ్చిన హామీమేరకు సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అని తెలిపారు. రైతాంగం ఆయిల్ ఫామ్ సాగు చెయ్యండి.. ఎకరానికి యాభై వేల రూపాయల సబ్సిడీ ఇస్తాం అని రైతాంగాన్ని కోరారు. ప్రతి జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు.

Next Story