గవర్నర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వాఖ్యలు చేశారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్నారు.. వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదు అని ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అని అన్నారు. గవర్నర్ కు ఒక పరిధి ఉంది.. ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టిందని.. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని.. గతంలో గవర్నర్లను గౌరవించాం.. గవర్నర్ లను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రికి, మాకు తెలుసునని అన్నారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్ క్రీమ్ పుష్ కార్ట్ (ట్రై సైకిల్స్ ) ను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డైరీని త్వరలో 1000 కోట్లకు పెంచుతామన్నారు. విజయ డైరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. వేసవిలో డైరీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాలని 50 శాతం సబ్సిడీ కింద వీటిని ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద ఆధారం లేనివారికి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి చోట ఔట్ లెట్ రావాలని ఫ్రాంచైజీలను కూడా ఇస్తున్నామన్నారు.