మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం

Minister Srinivas Goud father passed away.తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. ఆయ‌న తండ్రి నారాయణ గౌడ్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Feb 2021 4:11 PM IST
Minister Srinivas Goud father passed away.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. ఆయ‌న తండ్రి నారాయణ గౌడ్ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు తుదిశ్వాస విడిచారు. కాగా.. శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మంత్రి తల్లి గారిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


Next Story