ఎన్ని కుట్రలు పన్నినా వాళ్ళకే రివర్స్ తగులుతాయ్‌ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆధునీకరించిన హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్

By Medi Samrat  Published on  16 Aug 2023 2:25 PM IST
ఎన్ని కుట్రలు పన్నినా వాళ్ళకే రివర్స్ తగులుతాయ్‌ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆధునీకరించిన హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నా మీద ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాళ్ళకే రివర్స్ తగులుతాయన్నారు. నిజాయితీ గల వ్యక్తులకు గ్యారెంటీగా న్యాయం జరుగుతుందనే దానికి నేనే ఉదాహరణ అని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పనిచేశారని.. ఇప్పుడు వారంతా ఎక్కడో ఉన్నారని కామెంట్ చేశారు. మేము మాత్రం ఆనాడు కేసీఆర్ వెంటే ఉన్నామ‌ని.. ఇప్పుడూ ఆయననే నమ్ముకొని ఉన్నామ‌ని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ కేసీఆర్ వెంటే మా పయనం అని.. అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరిస్తామ‌ని పేర్కొన్నారు. జర్నలిస్టుల‌, రైతుల, అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామ‌ని తెలిపారు.

Next Story