మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 29 April 2025 12:05 PM IST

Telangana News, Chattigarh, Karreguttalu, Maoists, Security Forces, Peace Talks

మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. శాంతి యుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ప్రభుత్వాల లక్ష్యంగా పని చేయాలని అన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్-5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విదానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి..అని మంత్రి సీతక్క కోరారు.

ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నా. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తా. ఆపరేషన్ కగార్‌తో ఆదివాసీలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి..అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Next Story