ట్రాన్స్‌జెండర్లకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..!
నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ సభ జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 2:45 PM ISTనవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ సభ జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చేలా హన్మకొండ సభ ఉంటుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత థీమ్ తో విజయోత్సవ సభ ఉంటుందని తెలిపారు. విజయోత్సవ సభ వేదికగా మహిళా సాధికారతకు వినూత్న పథకాలు ప్రకటిస్తామన్నారు
నూతన పథకాలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పథకాల విధి విధానాలు, సభ ప్రాంగణంలో సెర్ప్ ఆద్వర్యంలో స్టాల్ల ఏర్పాటు, సభ ఏర్పాట్లను మంత్రి సీత సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యం అన్నారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ ఉంటుందన్నారు. విజయోత్సవ సభ వేదికగా మహిళల ఆర్ధిక బలోపేతం కోసం సరికొత్త పథకాలు తీసుకొస్తున్నామన్నారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించనుందని తెలియజేశారు.
దేశ చరిత్రలో మహిళా సంఘాలకు తొలిసారిగా విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు భీమా సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ట్రాన్స్ జెండర్లకు మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రాన్స్ జెండర్ల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నాట్లు మంత్రి తెలిపారు.