కూరగాయలు అమ్ముతున్న బాలుడిని చూసిన‌ మంత్రి సబిత.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..

Minister Sabitha spots boy selling veggies, asks him to attend school. కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించిన‌ మంత్రి సబిత.. ఆ బాలుడిని

By Medi Samrat  Published on  7 Feb 2022 1:20 PM GMT
కూరగాయలు అమ్ముతున్న బాలుడిని చూసిన‌ మంత్రి సబిత.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..

కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించిన‌ మంత్రి సబిత.. ఆ బాలుడిని పాఠశాలకు వెళ్లమని కోరింది. వివ‌రాళ్లోకెళితే.. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. సోమవారం తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బాలుడిని చూసిన మంత్రి ప్రజలతో ముచ్చటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భవిష్యత్తును భద్రపరచుకొనే ఏకైక పెట్టుబడి విద్య అని.. విద్య‌ విలువను తెలుసుకోవాలని మంత్రి పిల్లలకు పిలుపునిచ్చారు.Next Story
Share it