మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ బస్సులు..అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం

తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on  18 Feb 2025 1:05 PM IST
Telangana, Mahashivratri, TGSRTC, Minister  Ponnam Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ బస్సులు..అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం మంత్రి అధికారిక నివాస గృహంలో మహా శివరాత్రి సందర్భంగతా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్లపై అధికారులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాల దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత ఏడాది కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటం కారణంగా అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. బస్టాండ్‌ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడి మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story