నేడే ప్రజాభవన్‌లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్‌ ప్రారంభం

నేడు బేగంపేటలోని ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్‌ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించనున్నారు.

By అంజి  Published on  27 Sept 2024 6:58 AM IST
Minister Ponnam Prabhakar, Pravasi Prajavani, Praja Bhavan, Hyderabad, Telangana

నేడే ప్రజాభవన్‌లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌: నేడు బేగంపేటలోని ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్‌ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. గల్ఫ్‌ కా్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొననున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రజాభవన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఓపెన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికి ఫిర్యాదులు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే.

Next Story