అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త : మంత్రి పొన్నం
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Jan 2025 3:26 PM ISTజనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న.. 2 కోట్ల 81 లక్షల మందికి.. ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.. ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు.. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త ఉంటుందని.. వారికి జనవరి 26 నుండి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి.. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చన్నారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు.. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దు అన్నారు. కుల సర్వే ఆధారంగా.. అప్లికేషన్‌ల సమాచారం ఆధారంగా.. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. ఇందుర్తిలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం.. రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమి లేని రైతు కూలీలకు 12 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు
ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపాం.. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందన్నారు.