జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో స్థానిక నేతకే ఛాన్స్..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్‌ బై పోల్‌లో కాంగ్రెస్‌ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 29 July 2025 12:08 PM IST

Hyderabad News, Minister Ponnam Prabhakar, Jublihills Bypolls, Congress

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో స్థానిక నేతకే ఛాన్స్..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్‌ బై పోల్‌లో కాంగ్రెస్‌ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. నాన్‌ లోకల్‌ లీడర్లకు ఇక్కడ ఛాన్స్‌ లేదని తేల్చిచెప్పారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, నవీన్ యాదవ్‌లతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెరుగైన సేవలు, అభివృద్ధి కోసం అధికార పార్టీని గెలిపించండి. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నా. ప్రజాయుత కార్యక్రమాలు చేస్తోన్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి...అని మంత్రి పొన్నం కోరారు.

సీఎం రేవంత్, సహచర మంత్రుల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులు స్థానిక నియోజకవర్గానికి చెందిన వారే ఉంటారు. అభ్యర్థులు ఎందరున్నా, అందరూ కలిసి పని చేస్తారు. టికెట్ ఎవరికి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆశావహులు అన్ని డివిజన్లలో తీరుతారు. పార్టీని బలోపేతం చేస్తారు. బయట వారికి టికెట్ ఇవ్వం. అందరం కలిసి పని చేస్తాం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. అభ్యర్థులపై సర్వే జరుగుతుంది. ఎవరు మెరుగ్గా ఉంటే వారికి అవకాశాలు వస్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాం.. ఇక్కడ కూడా గెలుస్తాం..అందరం ఐక్యంగా పోరాడుతాం..అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

Next Story