మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా నోటి కాడి ముద్ద లాగొద్దు: పొన్నం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు..అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

By -  Knakam Karthik
Published on : 29 Sept 2025 1:09 PM IST

Telangana, Hyderabad, Minister Ponnam Prabhakar, BC Reservations

మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా నోటి కాడి ముద్ద లాగొద్దు: పొన్నం

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు..అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణలో కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ , సబ్ కమిటీ వేసి కేబినెట్ లో చర్చించి శాసన సభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి కి పంపడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం తెలపాలని దేశం మొత్తం ఎంపీలతో కలిసి ఢిల్లీలో కార్యక్రమాలు తీసుకున్నాం. గతంలో ఇందిరా సహాని , కృష్ణమూర్తి కేసు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్రాల చేతిలోనే ఉంటాయి అన్నారు. ఇటీవల తమిళనాడులో పెండింగ్‌లో బిల్లు మూడు నెలలు మించి ఆమోదించకపోతే సుప్రీంకోర్టు ఆమోదించుకున్నట్టే అని తెలిపింది.. దానిని ఆ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేశాం. న్యాయ స్థానాలపై గౌరవం ఉంది.. ఎవరు మా నోటి కాడి ముద్ద లాగద్దు అని విజ్ఞప్తి చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికి అన్యాయం జరగదు..ప్రామాణిక లెక్కల ప్రకారం, ప్రజల అభిప్రాయం ప్రకారం ఇది అమలు చేయడం జరిగింది..అని పొన్నం వ్యాఖ్యానించారు.

సామాజిక కోణంలో సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయ స్థానాల వద్ద సుమోటోగా ఉండేలా మద్దతు ఇవ్వాలి. రాజకీయ వేదికల్లో బలహీనవర్గాల కు 100 శాతం రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. శాసన సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 8 వ తేది నుండి వాద ప్రతివాదనలు ఉంటాయి. ఏకాభిప్రాయంగా జరిగిన శాసన సభలో ఆమోదం పొందిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నామని హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలి. కాంగ్రెస్, బీజేపీ, brs, సీపీఎం, సీపీఐ, జనసమితి అన్ని పార్టీలు, కుల సంఘాలు సామాజిక న్యాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. 42 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ కి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను మంత్రులు కొండా సురేఖ,వాకిటి శ్రీహరి అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం..రాజకీయ భేషజాలు పోము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి నాయకత్వం వహిస్తున్నారు..మా నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పై తీసుకున్న దానికి ముందుకు పోతున్నాం.. మా నోటి కాడి ముద్ద లాగద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం..అని పొన్నం పేర్కొన్నారు.

Next Story