Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. MCRHRDలో నిర్వహించిన ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ,ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటాం. అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. గత సంవత్సరం ముఖ్యమంత్రి గణేష్ ఉత్సవాలకు మండపాలకు ఉచిత విద్యుత్ అందించారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర రాజధాని లో జరుగుతున్న అతిపెద్ద వేడుక గణేష్ ఉత్సవాలు. ఆర్ అండ్ బి , జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, పోలీస్ ,హెల్త్ , విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని పని చేయాలి. ఇక్కడికి వచ్చే ముందే అన్ని డిపార్ట్మెంట్‌లు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు శాంతి భద్రతలు, మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు , ట్రాఫిక్ ఇబ్బందులు,విగ్రహాలకు వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి...అని మంత్రి పొన్నం సూచించారు.