ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.

By -  Medi Samrat
Published on : 4 March 2026 9:00 PM IST

ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా మా హక్కు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు.. మరో వ్యక్తి కాదు.. ప్రజలే న్యాయ నిర్ణేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు. అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయన్నారు. ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసు.. గత 12 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తమాషా చూస్తున్నారు.. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మీరా మాట్లాడేది..? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.. ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్ముతున్నారు.. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి..పేదలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు.. విద్వేషాన్ని రెచ్చగొట్టి మైనార్టీ లను అణగారిన వర్గాలను బూచిగా చూపి మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు.. నిత్యం మతవిద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని మండిప‌డ్డారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈడి సీబీఐ కేసులతో విపక్ష ప్రభుత్వాలను కూలుస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాజకీయం మీది.. దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు ఐక్యతను చాటి మీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న రాహుల్ గాంధీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మిస్తే మీ ముఖం మీదే పడుతుందన్న వాస్తవాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్.. ఈ వ్యవహారశైలి మార్చుకోవాలని హితువు ప‌లికారు.

Next Story