లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో , నప్రత్ చోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పై పోరాటం చేస్తున్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీ కి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్ట్ చేయడం సరికాదు..దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు..అని పొన్నం వ్యాఖ్యానించారు.
ఓటర్ల లిస్టు కు సంబంధించి అవతకవకలపై ఆటంబాబులాగ వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేని బీజేపీ.. దానిపై నిరసనలు తెలిపే అవకాశాలను కూడా కాలరాస్తు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ ,విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది అప్రజాస్వామిక చర్య..దేశం ఎటుపోతుందో అనే మాట ఉత్పన్నం అవుతుంది. వెంటనే వారందరినీ విడుదల చేయాలి నిరసన తెలిపే హక్కును కల్పించాలి. రాహుల్ గాంధీ గారు లేవనెత్తుతున్న ఓటు చోరీ పై ఈసీ మాట్లాడాలి దానిని సరిదిద్దుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్యల వల్ల గొప్పగా మేమేదో విజయం సాధించామని రాక్షస ఆనందం పొందడం సరికాదని నరేంద్ర మోదీ,అమిత్ షా , బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా..అని పొన్నం మాట్లాడారు.