నాకు అభ్యంతరం లేదు.. ఆర్థిక మంత్రి ఒకే అంటే చేసేయండని సీఎం చెప్పారు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలి విడత మహా లక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది.

By Medi Samrat  Published on  12 March 2024 8:32 AM GMT
నాకు అభ్యంతరం లేదు.. ఆర్థిక మంత్రి ఒకే అంటే చేసేయండని సీఎం చెప్పారు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలి విడత మహా లక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. తొలి దశలో 25 ఎలక్ట్రిక్ బస్సులను ఢిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎరియర్ బాండ్స్ చెక్కులను మంత్రులు ఆర్టీసి ఉద్యోగులకు అందించారు.

అనంత‌రం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసి మహా లక్ష్మి ద్వారా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించుకోవ‌డం శుభ పరిణామం. మహా లక్ష్మి పథకం మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కోమటి రెడ్డి ఆర్టీసీ విషయంలో ఆప్యాయంగా ఉంటారన్నారు. మొన్న బాబు జగ్జీవన్ రాం భవనాన్ని ప్రారంభించుకోవడానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిసి పీఆర్సీ ఇవ్వాలని చెప్పాను. నాకు అభ్యంతరం లేదన్నారు.. ఆర్థిక మంత్రి ఒకే అంటే చేసేయండి అన్నారని వివ‌రించారు.

ఆర్టీసీని ఒకప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మహా లక్ష్మి పథకం వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు కళకళలాడుతుందన్నారు. 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన సంస్థలో బాండ్స్, కారుణ్య నియామకాలు, పీఆర్సీ, కొత్త నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు మహా లక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతున్నారు.. వారికి అభినందనలు.. మహా లక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతుందన్నారు. ఆర్టీసీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులంతా సహకరిస్తున్నారన్నారు.

100 శాతం ఆక్యూపెన్సి తో ముందుకు వెళ్తుందన్నారు. ఆపరేషన్ లాస్ నుండి ఓవర్ కం అయి పాత బకాయిలు కూడా తీర్చుకుంటామ‌న్నారు. కొత్త నియామకాలు చేపడుతున్నామ‌న్నారు. ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించే బస్సు.. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామ‌న్నారు. మహలక్ష్మీ లో మొదటిసారి ఎలక్ట్రిక్ నాన్ ఎసీ బస్సులు వచ్చాయి. రాబోయే కాలంలో అనేక బస్సులు వస్తున్నాయని తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించి.. ఆర్టీసీ అభివృద్ధిని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంద‌న్నారు. ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీకి పూర్తిగా సహకరిస్తున్నారని కొనియాడారు.

Next Story