బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌తో మంత్రి పొన్నం కీలక భేటీ

బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.

By -  Knakam Karthik
Published on : 5 Oct 2025 4:15 PM IST

Telangana, BC Reservations, CM Revanthreddy, Minister Ponnam

బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌తో మంత్రి పొన్నం కీలక భేటీ

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో బీసీల రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. దీంతో తాజాగా జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి లు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశమై బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పై సుప్రీం కోర్టు వెళ్లిన అంశాలు తాజాగా జరుగుతున్న పరిణామాల పై వివరించారు.

Next Story