గుడ్‌న్యూస్‌.. గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తాం

ధరణి చట్టంతో భూములు ఉన్న ఆసాములు అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  13 Nov 2024 10:22 AM GMT
గుడ్‌న్యూస్‌.. గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తాం

ధరణి చట్టంతో భూములు ఉన్న ఆసాములు అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మంత్రుల‌తో మ‌ఖాముఖి కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామ‌ని తెలిపారు. అత్యధికంగా ఇండ్లకు సంబంధించిన అర్జీలు వచ్చాయి. BRS డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నమూనా చూపి ఎన్నికల్లో గెలిచారు.. తప్ప కట్టించలేదన్నారు.

24 లక్షల ఇండ్లను పేదలకు ఇస్తామని చెప్పాం.. ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 4 వందల చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాలి.. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం ప్రభుత్వం డబ్బు ఇస్తుందన్నారు. గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విడతల వారీగా 5 లక్షల రూపాయలను ఇండ్ల నిర్మాణానికి ఇస్తామ‌న్నారు.

ఇంటికి మహిళ యజమాని పేరిట ఇవ్వాలనేది మా లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే రోల్ మోడల్ గా ఉండే కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం తీసుకువస్తామ‌న్నారు. ధరణిని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టారు.. దానిని నెల కిందట విడిపించామ‌ని తెలిపారు. త్వరలో ఉద్యోగాల నియామకాలకు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేస్తామ‌న్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉంది.. ఇందిరమ్మ రాజ్యంలో తొండి ఆట ఆడమ‌న్నారు.

మిగిలిన అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామ‌న్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం.. అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళు అన్నారు. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద‌న్నారు. BRS హాయంలో రైతులను జైల్లో వేసింది మరిచిపోయి.. రైతుల వద్దకు వచ్చి.. ధర్నాలు, నిరాహార దీక్షలు పోరాటాలు అవసరం లేదన్నారు. లగచర్ల ఇష్యూలో కాస్త ఓపిక పడితే నిజాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తాయన్నారు. ప్రతిపక్షం మాదిరి తొందర అవసరం లేదన్నారు.

Next Story