ఇందిరమ్మ ఇళ్ల‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణం నిరంత‌ర ప్రక్రియ‌ అని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  17 Jan 2025 9:15 PM IST
ఇందిరమ్మ ఇళ్ల‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణం నిరంత‌ర ప్రక్రియ‌ అని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేన‌ని స్పష్టం చేశారు. మొద‌టి విడ‌త‌లో ఇళ్ల‌ స్థలం ఉన్నవారికి , రెండో విడ‌త‌లో ఇంటి స్థలంతో పాటు ఇందిర‌మ్మ ఇల్లును నిర్మించి ఇస్తామ‌ని తెలిపారు.

ఇందిర‌మ్మ ఇళ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవ‌స్ధ‌, స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలోని కార్యాల‌యంలో శుక్రవారంనాడు చీఫ్ సెక్రట‌రీ శాంతికుమారితో క‌లిసి ఆయన స‌మీక్షించారు.ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఇంజ‌నీరింగ్ విభాగాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామ‌కం, సర్వేయ‌ర్ల నియామ‌కంపై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల‌కు అర్హులైన ల‌బ్దిదారుల‌కు సంబంధించిన నివాస స్థలం ఉన్నవారి, నివాస స్థలం లేని వారి ప్రకారం రెండు జాబితాల‌ను గ్రామ‌సభ‌ల్లో పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ద‌శ‌ల వారీగా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు.

Next Story