రైతు బంధు డబ్బులు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి

రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు.

By అంజి
Published on : 22 March 2024 7:37 AM IST

Minister Ponguleti Srinivas Reddy, Rythubandhu, Telangana

రైతు బంధు డబ్బులు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి

రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. గురువారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో పొంగులేటి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు.

చాలా మంది బీఆర్ఎస్‌ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ధరణి అక్రమాలను వివరాలతో సహా బయటపెడతామని, మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదిలిపెట్టబోమని తెలిపారు. ధరణితో పాటు రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు.

Next Story