మంత్రి ఉత్తమ్‌తో భేటీ అయిన కేరళ మినిస్ట‌ర్‌

కేరళ ప్రభుత్వానికి మా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్న అందజేస్తామ‌ని సివిల్ సప్లైశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  2 Feb 2024 2:23 PM IST
మంత్రి ఉత్తమ్‌తో భేటీ అయిన కేరళ మినిస్ట‌ర్‌

కేరళ ప్రభుత్వానికి మా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్న అందజేస్తామ‌ని సివిల్ సప్లైశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేరళ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి జి.ఆర్ అనిల్ సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ బియ్యం, మిర్చిని కోనుగోలు చేయడానికి అంగీకారం తెలిపారని తెలియ‌జేశారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి కేరళ రాష్ట్రం సిద్ధంగా ఉందని వెల్ల‌డించారు. విజేత, స్వర్ణ రకాల బియ్యం తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ వైరటీ ధాన్యం పండించే రైతులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించామ‌ని తెలిపారు.

Next Story