రాష్ట్రంలో సంచలనం సృష్టించిన‌ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం, హ‌త్య‌ ఘటనపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేస్తామని తెలిపారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామని, ప్ర‌భుత్వం త‌రుపున ఆదుకుని అండ‌గా ఉంటామ‌న్నారు.


ఇదిలావుంటే.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో దిశ ఘటనలో పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలోనూ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామంటూ మంత్రి మల్లారెడ్డి చెప్ప‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతుంది.


సామ్రాట్

Next Story