రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం : మంత్రి కేటీఆర్‌

Minister KTR tweet on Rahul Gandhi Telangana Tour.తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నేడు(శుక్ర‌వారం)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 6:33 AM GMT
రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం : మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నేడు(శుక్ర‌వారం) ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణ‌కు వ‌స్తున్న రాహుల్ గాంధీకి స్వాగ‌తం అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై స్ట‌డీ చేయాల‌ని రాహుల్‌కు సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని మంత్రి కేటీఆర్ చుర‌క‌లు అంటించారు.

'తెలంగాణ రైతుల పట్ల తనకున్న సానుభూతి ఉన్నప్పటికీ ఆయన తెలంగాణలో పర్యటించడం స్వాగతించదగినది. తెలంగాణ కంటే మెరుగైన పాలనా నమూనాను నాకు చూపించాలని రాహుల్‌గాంధీని కోరుతున్నాను. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు బంధు అందిస్తున్నాయా..? 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాయా..? లేక వ్యవసాయ రుణమాఫీ హామీని నెరవేర్చాయా? రైతుల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదని, నేను ఈ విషయాన్ని చాలా గ‌ర్వంగా చెబుతున్నాను 'అని మంత్రి కేటీఆర్ అన్నారు.

అటు రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it