అన్నింటికీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ కార‌ణ‌మ‌ట : మంత్రి కేటీఆర్‌

Minister KTR Satires on BJP over Declining Rupee Value.డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ అత్యంత క‌నిష్ట స్థాయికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2022 11:47 AM IST
అన్నింటికీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ కార‌ణ‌మ‌ట : మంత్రి కేటీఆర్‌

డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ నానాటీకి ప‌డిపోతున్న‌ప్ప‌టికీ కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఓ వైపు రూపాయి విలువ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయింది. మ‌రోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి రేష‌న్ దుకాణాల్లో ప్ర‌ధాని ఫోటో కోసం వెతుకుతున్నార‌ని సెటైర్లు వేశారు. అంతేకాకుండా సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే రూపాయి విలువ ప‌త‌న‌మైపోయింద‌ని ఆమె చెబుతున్నార‌న్నారు. నిరుద్యోగం, ద్ర‌వ్యోల్భ‌ణం, ఇలా అన్ని ఆర్థిక అవ‌రోధాల‌కు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కార‌ణ‌మని చెప్పారు. విశ్వ‌గురును పొగ‌డండి అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఫారెక్స్‌ మార్కెట్ లో గురువారం భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద ముగిసింది. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే. అంతేకాదు, ఈ ఏడాది రూపాయి నమోదు చేసిన భారీ పతనాల్లో ఇదొకటి. ఫిబ్రవరి 24న 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది. గురువారం ఉదయం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్ డాలర్‌ మారకంలో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 80.95ని తాకింది. చివరికి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది.

Next Story