ఆ చిన్నారుల‌ను ఆదుకోండి.. కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్‌

Minister ktr requests officials to help orphaned girls of mahabubabad. మహబూబాబాద్‌ జిల్లా సింగారం గ్రామంలో ఇద్దరు దంపతులు కరెంట్‌ షాక్‌ కారణంగా మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలు అయ్యారు.

By అంజి  Published on  22 Nov 2021 8:41 AM GMT
ఆ చిన్నారుల‌ను ఆదుకోండి.. కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్‌

మహబూబాబాద్‌ జిల్లా సింగారం గ్రామంలో ఇద్దరు దంపతులు కరెంట్‌ షాక్‌ కారణంగా మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వారిని ఆదుకోవాలని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు, తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సింగారంలోని ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్‌, తిరుపతమ్మలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారికి శ్యామల (8), బిందు (6) ఏళ్ల వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇటీవల దంపతులు ఇద్దరు సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు రాత్రి తిరుపతమ్మ బట్టలను ఉతికింది. అనంతరం వాటిని తెలియక కరెంట్‌ ప్రవహిస్తున్న దండెంపై ఆరేయగా షాక్‌ తగిలింది. దీంతో భార్యను ఉపేందర్‌ రక్షించబోయి ఇద్దరూ మృతి చెందారు. వీరిద్దరికి శ్యామల, బిందులే అంత్యక్రియలను నిర్వహించారు. ఇకపై మమ్మల్ని ఎవరూ చూస్తారు చిన్నారులు విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంట తడి పెట్టించింది.


Next Story
Share it