నిందితుడు దొర‌క‌లేదు.. పొర‌పాటున ఆ ట్వీట్ చేశా : మంత్రి కేటీఆర్‌

Minister KTR regrets his tweet on Saidabad incident.హైద‌రాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఆరేళ్ల చిన్నారిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2021 2:13 AM GMT
నిందితుడు దొర‌క‌లేదు.. పొర‌పాటున ఆ ట్వీట్ చేశా : మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఆరేళ్ల చిన్నారి హ‌త్యాచార ఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అభం, శుభం తెలియ‌ని ఆరేళ్ల బాలిక జీవితాన్ని చిదిమేసిన రాజు అనే నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు తొలుత తాను చేసిన ట్వీట్ ప‌ట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్య‌క్తం చేశారు. స‌మాచార లోపంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు పొరపాటున తాను ట్వీట్ చేశాన‌న్నారు. నిందితుడు ఇంకా ప‌రారీలోనే ఉన్నాడ‌ని.. అత‌డిని ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నార‌ని కేటీఆర్ తెలిపారు. నిందితుడు త్వ‌ర‌గా నిందితుడిని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. నిందితుడు త్వరగా అరెస్టయి, తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో ఆకాంక్షించారు.

నిందితుడు రాజును పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డ్‌ అందించనున్నట్లు పోలీసులు మంగళవారం ప్రకటించారు. 9490616366 నెంబ‌ర్‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. అత‌డి గురించి స‌మాచారం అందించిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ పేరిట ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

Next Story