కాంగ్రెస్ పార్టీని పొన్నాల లక్ష్మయ్య వీడిన సంగతి తెలిసిందే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తామన్నారు. జనగామలో జరిగే బీఆర్ఎస్ సభ ద్వారా పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కేటీఆర్ వివరించారు. పొన్నాల సీఎం కేసీఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని తెలిపారు.
నేడు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కేటీఆర్ ఈ రోజు పొన్నాల నివాసానికి వెళ్లారు. పెద్ద ఎత్తున పొన్నాల అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు.