ఇది నెక్ట్స్‌లెవ‌ల్‌.. చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా?: నిప్పులు చెరిగిన‌ కేటీఆర్

Minister KTR Fire On BJP Cheif Bandi Sanjay. తన మీద విపక్షాలు చేస్తున్న డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

By Medi Samrat  Published on  20 Dec 2022 7:02 PM IST
ఇది నెక్ట్స్‌లెవ‌ల్‌.. చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా?: నిప్పులు చెరిగిన‌ కేటీఆర్

తన మీద విపక్షాలు చేస్తున్న డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష కోసం తన ర‌క్తం ఇచ్చేందుకు సిద్ధం అని కేటీఆర్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌కు స‌వాల్ విసిరారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో డ్ర‌గ్స్ విమ‌ర్శ‌ల‌పై ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు కేటీఆర్ సమాధానం చెప్పారు. కేటీఆర్ డ్రగ్స్ వాడుతూ ఉంటారని.. బండి సంజయ్ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం.. అందులో క్లీన్ చిట్ తో బయటికి వస్తా.. మరి నాపై ఆరోపణలు చేసిన వాడు కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా? అంటూ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు. నా చెప్పుతో కొడతానంటే అవమానపరిచాడంటూ తొక్కలో రాగాలు తీస్తారు... అందుకే ఆయన చెప్పుతో ఆయననే కొట్టుకోమని చెబుతున్నా అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

"డ్రగ్స్ టెస్టు కోసం నా రక్తం తీస్తారో, చర్మం తీస్తారో.. ఏం తీసుకుపోతారో తీసుకోండి. కావాలంటే నా బొచ్చు కూడా ఇస్తాను! నా చిత్తశుద్ధిని నిరూపించుకుని బయటికి వస్తా. తన చెప్పుతో తానే కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు.. నేను ఇక్కడే ఉంటా.. ఏ డాక్టర్ ను తీసుకువస్తాడో, ఏ గుండు కొట్టే ఆయనను తీసుకొస్తాడో తీసుకురమ్మనండి. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా చర్మం, ఇస్తా, నా గోర్లు ఇస్తా.. వాని బొంద.. ఏం కావాలో అన్నీ ఇస్తా. కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా! నీ పిండాకూడు.. ఏం రాజకీయం అయ్యా ఇది! వానికేమైనా తెలివి ఉందా అసలు.. మనిషా, పశువా? కరీంనగర్ కు ఏం చేశావంటే చెప్పే పరిస్థితి లేదు. పిచ్చి అరుపులు, గావుకేకలు, పెడబొబ్బలు, హౌలా మాటలు తప్ప ఇంకేముండదు" అంటూ కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.


Next Story