మంత్రి కేటీఆర్ ఇంట విషాదం

Minister KTR father in law Harinath Rao passed away.తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇంట విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 10:58 AM IST
మంత్రి కేటీఆర్ ఇంట విషాదం

భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇంట విషాదం నెల‌కొంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ హ‌రినాథ‌రావు మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్స‌రాలు.

కాగా.. హ‌రినాథ‌రావు మృతిచెందిన విష‌యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌, ఆయ‌న భార్య నీలిమ, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి వెళ్లారు. ఆయ‌న భౌతిక కాయాన్ని రాయ‌దుర్గంలోని ఓరియ‌న్ విల్లాస్‌లో ఉన్న నివాసానికి త‌ర‌లించారు. హ‌రినాథ‌రావు మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ వియ్యంకుడికి నివాళులు అర్పించేందుకు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story