రేటెంత రెడ్డి అంటూ కేటీఆర్ కౌంటర్లు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ కౌంటర్లు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో..

By Medi Samrat  Published on  7 Oct 2023 8:15 PM IST
రేటెంత రెడ్డి అంటూ కేటీఆర్ కౌంటర్లు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ కౌంటర్లు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అనడంలేదు.. రేటెంత రెడ్డి అంటున్నారు.. పాపం కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఏం జరుగుతోంది రాష్ట్రంలో.. ఆనాడేమో ఓటుకు నోటు.. నేడు సీటుకో రేటు అని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో చాలా లొల్లి జరిగింది. పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారని.. జరుగుతున్న పరిణామాలతో మొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నిన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేసి నా సమక్షంలోనే బీఆర్ఎస్ లో చేరారని అన్నారు.

ఇక ఎన్నికలైన మరునాడే గెలిచిన పదో పన్నెండు మందో ఎమ్మెల్యేలతో కలిసి ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేయకపోతే నన్ను నిలదీయండని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు, ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి. 1999లో కిషన్ రెడ్డి కార్వాన్ లో పోటీ చేస్తే ఆయనకు ఎన్నికల ఏజెంటుగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశాడని.. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీతో తెరచాటు చీకటి అనుబంధం కొనసాగిస్తున్నాడన్నారు.

Next Story