AICC అంటే ఆలిండియా కరప్షన్ కమిటి: మంత్రి కేటీఆర్

ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కర్షప్షన్‌ కమిటి అన్నారు మంత్రి కేటీఆర్.

By Srikanth Gundamalla  Published on  3 July 2023 10:36 AM IST
Minister KTR, BRS, Counter Tweet, Congress, Telangana,

AICC అంటే ఆలిండియా కరప్షన్ కమిటి: మంత్రి కేటీఆర్

ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కర్షప్షన్‌ కమిటి అన్నారు మంత్రి కేటీఆర్.కాంగ్రెస్‌ ఖమ్మం జనగర్జన సభలో తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీ కేసీఆర్‌ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే.. కాంగ్రెస్ నాయకుల కామెంట్స్‌ తర్వాత వెంటనే ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ నాయకుల విమర్శలను తిప్పి కొట్టారు.

ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కర్షప్షన్‌ కమిటి అన్నారు మంత్రి కేటీఆర్, అవినీతి, అసమర్ధతకు కాంగ్రెస్‌ పార్టీ కేరాఫ్‌ అడ్రస్ అని అన్నారు. బీఆర్ఎస్‌ ఎవరికీ బీ టీమ్ కాదని.. కాంగ్రెస్‌ పార్టీనే భారత రాంబందుల పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్స్‌ అని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీకి బీఆర్ఎస్‌ ఎప్పుడూ బీ టీమ్‌ కాదని.. కాంగ్రెస్‌ సీ టీమ్‌ అంతకన్నా కాదన్నారు. అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలను ఒంటి చేత్తో ఢీకొట్టే సత్తా బీఆర్ఎస్‌కు ఉందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి కేటీఆర్.

బీఆర్ఎస్‌ను నేరుగా ఢీకొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి తమని కాల్చేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అర్థం లేకుండా మాట్లాడి ఇంకా ఎన్నిసార్లు నవ్వులపాలవుతారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది ప్రజలు కానీ.. కాంగ్రెస్‌ కానే కాదని ఆ పార్టీ నేతలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో ప్రజలకు ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్‌ను గెలిపించాల్సి వచ్చిందన్నారు.

Next Story