బాలుడి టాలెంట్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా.. తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్‌

Minister KTR asks a boy details.ఓ బాలుడు జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో ప‌ల్టీలు కొడుతున్న వీడియో చూసి ఆ బాలుడు ఎవరో తెలిస్తే చెప్పండి అని కేటీర్ ట్వీట్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jan 2021 12:03 PM IST
Minister KTR asks a boy details

ఓ బాలుడు జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో ప‌ల్టీలు కొడుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ ఈ బాలుడి వీడియోను చూశారు. ఆ బాలుడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఆ బాలుడిలో అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని.. ఇది త‌న‌కు సండే మోటివేష‌న్ గిప్ట్ అని.. అత‌డి గురించి తెలిస్తే చెప్పాల‌ని ట్వీట్ చేశారు. అత‌డిని ప్రోత్స‌హిస్తే.. త‌ప్ప‌క ఒలంపిక్ ప‌త‌కాన్ని తీసుకువ‌స్తాడ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.


'వావ్ ఒలంపిక్ మెడ‌లిస్ట్ త‌యార‌వుతున్నాడు. అత‌డు తెలంగాణ బాలుడా? లేక దేశంలోని ఇత‌ర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నాను' అని కేటీఆర్ ఆ వీడియోను రీ ట్వీట్ చేస్తూ ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఆ బాలుడు ఎవ‌రా అని ప్ర‌స్తుతం నెటీజ‌న్లు తెలుసుకునే ప‌నిలో ఉన్నారు.


Next Story