ఇక ఆ విషయం వారే చూసుకుంటారు : కొండా సురేఖ
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.
By - Medi Samrat |
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తాజా పరిణామాలపై మా పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. జరిగిన విషయాలపై పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తాం అని హామీని ఇచ్చారని.. పార్టీ పెద్దలు మ్యాటర్ సెటిల్ చేస్తా అని తెలిపారని.. ఇక ఆ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నానని వెల్లడించారు. మీడియా సోదరులు ఉదయం నుంచి ఈ విషయంలో నాకోసం వేచి చూశారని.. మిమ్మల్సి దాటి మాట్లాడకుండా వెళ్లడం సరికాదని మాట్లాడుతున్నా.. అందరికీ ధన్యవాదాలు అంటూ ముగించారు.
ఇదిలావుంటే.. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కలిసి తమ కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మా అమ్మ సురేఖను మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారు. సుమంత్ మీద కేసు పెట్టి దానిని మెల్లగా మా అమ్మ మీదకు డైవర్ట్ చేసి మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు కలిసి బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.