గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
By Knakam Karthik
గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
నిబంధనల ప్రకారమే పని, అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తున్నా..అని తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాను. నా శాఖలో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం. ఆమెకు మా ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు. సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేం. భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం ఆమెకు ఉంది.’’ అని కొండా సురేఖ అన్నారు.
పని చేసే వాళ్లపైనే రాళ్లు పడుతాయి: కొండా మురళి
కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం..అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ..నేను మొదటిసారి ఇంఛార్జిని కలిశా. ఎల్బీస్టేడియంలో జరిగే రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని డిస్కస్ చేసాం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతుగా ఉంటాను. పని చేసే వారి పైనే రాళ్లు పడుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటా. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే భాధ్యత నాదే. వైఎస్సార్ హయాం నుంచి మేము నిబద్దతతో పనిచేస్తున్నాం. గ్రూపులు లేనిది ఎక్కడ., నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా..బీసీల అభ్యున్నతికి పనిచేస్తా. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నా..అని కొండా మురళి వ్యాఖ్యానించారు.