ఆ రూట్‌లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ నుండి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం..అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 3 Aug 2025 9:15 PM IST

Telangana, Hyderabad, Minister Komatireddy Venkatreddy, Green Field Road

ఆ రూట్‌లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ నుండి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం..అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో క్షేత్ర స్థాయి పనులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది కోసం కృషి చేశాను. ఇప్పుడు రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఉన్నాను..ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తాను. సుమారు 650 కోట్ల వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నాం. హైదరాబాద్ నుండి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం. కేంద్ర మంత్రి గడ్కరీని ఈనెల 6న కలుస్తాం..అని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ అభివృద్ది చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చింది..అభివృద్ది చేయలేదు. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేసింది. ప్రజలే దేవుళ్ళుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. బీసీ రిజర్వేషన్లు కేసిఆర్ బిడ్డకు ఏం పని..10ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు బీసీల గురించి. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది మా ఇందిరమ్మ ప్రభుత్వ విధానం. రేషన్ కార్డులు,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం...అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Next Story