రాజలింగమూర్తి హత్యలో వారి పాత్ర ఉంది : మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
టీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 20 Feb 2025 1:15 PM IST
టీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్న.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌తో పాటు ఐదుగురుపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడని.. హత్య గండ్ర వెంకటరమణారెడ్డి చేయించాడని సంచలన ఆరోపణ చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటీఆర్ లు హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెప్తున్నారని.. అడ్వకేట్ వామన రావు, భార్యభర్తల హత్యకు ఎవరు కారణమో అందరికీ తెలుసు అని అన్నారు.
వరంగల్ లో ఎంపీడీఓ హత్య బీఆర్ఎస్ వాళ్ళు చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారు. కొడంగల్ లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే.. తెలంగాణలో అభివృద్ధి జరగొద్దు అనేది వారి ఉద్దేశ్యమన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు.. హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్.? అని ప్రశ్నించారు. కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప కేసీఆర్‌తో ఏమి కాదు.. 15 నెలల నుండి పామ్ హౌస్ నుండి ఎప్పుడైనా బయటకి వచ్చిండా.? అని ప్రశ్నించారు.
రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్న.. హత్య లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందన్నారు. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటారన్నారు.
లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూసిండ్రు.. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదన్నారు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్‌కు కూడా రక్షణ కల్పిస్తామన్నారు. తెలంగాణను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా.? పాపం తగిలి పోతరని శాపనార్ధాలు పెట్టారు.