బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బీజేపీ.. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమన్నారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని హితువు పలికారు. బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి కి తెలుసా.. మహేశ్వర్ రెడ్డి..! పనికి రాని చిట్ చాట్ లు మానుకో..! అని సూచించారు.