ఆయ‌న‌కు కోపం వచ్చేది.. కానీ పగ ఉండేది కాదు : మంత్రి కోమటిరెడ్డి

ఏ రాజకీయ అండలేకుండా.. స్వశక్తితో ఎదిగిన అరుదైన నాయకుడు రోశయ్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  4 Dec 2024 2:08 PM IST
ఆయ‌న‌కు కోపం వచ్చేది.. కానీ పగ ఉండేది కాదు : మంత్రి కోమటిరెడ్డి

ఏ రాజకీయ అండలేకుండా.. స్వశక్తితో ఎదిగిన అరుదైన నాయకుడు రోశయ్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. స్వర్గీయ రోశయ్య వర్ధంతి సభలో ఆయ‌న మాట్లాడుతూ.. రోశయ్యకి కోపం వచ్చేది.. కానీ పగ ఉండేది కాదన్నారు. విలువలతో కూడిన విమర్శలు చేయడం ఒక్క రోశయ్యకే చెల్లిందన్నారు. రాజకీయాలు వ్యక్తిగతం కావు.. ప్రజలు ఇచ్చిన నమ్మకాల్ని నిలబెట్టే బాధ్యత అని నమ్మిన అరుదైన నాయకుడు రోశయ్య అని కొనియాడారు.

ఏ రోజు ఓవర్ డ్రాఫ్ట్ కు పోలేదని గొప్పగా చెప్పిన ఏకైక ఆర్ధిక మంత్రి రోశయ్య అని అన్నారు. రోశయ్య అంత జాగ్రత్తగా, నిజయితీగా మరే ఆర్ధిక మంత్రి పనిచేయలేదంటే అతిశయోక్తి కాదన్నారు. పౌరుషానికి ప్రతీకైన పల్నాటి నుంచి శత్రువులే లేని అజాతశత్రువు రోశయ్య అని కితాబిచ్చారు. రోశయ్య ఆశయాల్ని, విలువల్ని పాటించడమే వారికి మనమిచ్చే నివాళి అని అన్నారు. కొత్త తరం నాయకులు రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Next Story