టచ్ చేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. టచ్ చేస్తే నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు

By Medi Samrat  Published on  21 Feb 2024 8:45 PM IST
టచ్ చేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. టచ్ చేస్తే నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి ఖిల్లా మీద రోప్ వేసుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రూ. 200 కోట్లు అడిగితే కనీసం స్పందించలేదన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఫైల్ దగ్గర పెట్టుకొని సొంత రాష్ట్రానికి కనీసం రూ. 200 తేలేని మంత్రి కిషన్ రెడ్డి అని విమర్శించారు. కేబినెట్ లో ఉంటూ కనీసం రూ. 200 కోట్ల నిధులు ఇవ్వలేక పోయారని, తాము వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రూ. 3 వేల కోట్ల పనులు తెచ్చుకున్నామన్నారు. అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రెండు మూడు రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామని చెప్పారు. నమామి గంగాకు కేంద్రం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసిందని, హైదరాబాద్ లోని మూసీకి నిధులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఖతం అయ్యే పార్టీ అంటూ విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Next Story