బాధపడకండి.. ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షం కురుస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.

By Medi Samrat  Published on  20 March 2024 12:30 PM GMT
బాధపడకండి.. ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షం కురుస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. నష్టపోయిన రైతులు అధైర్యపడకండని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెప్పినా తీరుమారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే రైతుల నుండి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగితే సహించేదే లేదని స్పష్టం చేశారు.

రాబోయే రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించారు.

Next Story