సాగునీటి ప్రాజెక్టుల పనులను చూస్తుంటే బాధనిపిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి

తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదని

By Medi Samrat  Published on  29 Dec 2023 2:07 PM IST
సాగునీటి ప్రాజెక్టుల పనులను చూస్తుంటే బాధనిపిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి

తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేడిగ‌డ్డ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటర్లు బిగించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు అప్పటి ప్రభుత్వానికి చెప్పి ఉండాల్సింది.. సలహాలు ఇవ్వాల్సిఉండెన‌న్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను చూస్తుంటే బాధ అనిపిస్తుందన్నారు. ప్రాజెక్ట్ ప‌నులు, జ‌రిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామ‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చారు.? ఎన్ని ఎకరాలు పారింది.? ఎంత కరెంట్ బిల్లు వచ్చిందని బీఆర్ఎస్ నేత‌ల‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్ర‌శ్నించారు. మేడిగడ్డ వద్ద పిల్ల‌ర్ కూలినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామ‌న్నారు. ఇంత పెద్ద వ్యయం చేసి నిర్మించిన ప్రాజెక్ట్ గురించి.. ఇప్పటి పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.

Next Story