రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 25 Oct 2025 7:24 AM IST

Telangana, Minister Komatireddy Venkat Reddy, Roads, Cm Revanthreddy

రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి ట్వీట్ చేశారు. మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తాం. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చు. 2026 నూతన సంవత్సరంలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభం అవుతాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచే రోడ్లు తెలంగాణలో నిర్మించబోతున్నాం. అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలవబోతుంది. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఆర్ అండ్ బి శాఖకు పూర్తి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు...అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్ల విలువైన R&B బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసిందని, మరో రూ.50 కోట్లు త్వరలో విడుదల చేస్తామని వెంకట్ రెడ్డి ప్రకటించారు. గత BRS పాలనలో చెల్లించని బిల్లుల కారణంగా చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారని, మిగిలిన బకాయిలన్నీ త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యువత హెల్మెట్లు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని ఆయన కోరారు

Next Story