ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి సీరియస్

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు.

By Medi Samrat  Published on  3 Dec 2024 4:13 PM GMT
ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి సీరియస్

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం అని విచారం వ్య‌క్తం చేశారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చ‌రించారు. విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని మంత్రి కోరారు. ఇంటర్ విద్యార్ధులకు ఏదైనా అత్యవసర సమస్య ఉంటే నా ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ ద్వారా తెలియజేయండని కోరారు. చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు - బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపు నిచ్చారు.

Next Story