కేసీఆర్ ఇచ్చిన ఆ డబ్బులు ఎక్క‌డివి.? : మంత్రి జూపల్లి

హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతుండు.. హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న.. హారీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు

By Medi Samrat  Published on  19 Oct 2024 2:45 PM IST
కేసీఆర్ ఇచ్చిన ఆ డబ్బులు ఎక్క‌డివి.? : మంత్రి జూపల్లి

హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతుండు.. హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న.. హారీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు.. నేను వస్తాను తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర ఆదాయం ఎంత.? అవినీతి ఎంత.? అప్పు ఎంత.? ఏవరెవరు ఎంత దోచుకున్నారు చర్చ చేద్దాం అని ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లాల్ బహుదూర్ స్టేడియంలో మీడియా సమ‌క్షంలో 50 వేల ప్రజలు చూసే విధంగా చర్చ చేద్దామ‌న్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నవి.. నేను మీ అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తాన‌న్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడతడు అంటుండు.. కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చినవి అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కాకుండా హరీష్ రావు మంత్రి అయి డాన్స్ వేసిండ‌న్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ లో లక్షా యాభై వేల కోట్ల దోపిడి జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీష్ రావు లు తప్పుదోవ పట్టిస్తున్నారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే నీతి మంతులం అంటున్నారు. వాళ్లే నిజాయితీగా పాలన అందించాం అంటున్నారు.. ఇస్టమన్ కలర్ లాగా బావ బామ్మర్దుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణను మొత్తం దోచుకుంది వాళ్లేన‌న్నారు. రాజకీయంగా దివాళా తీసిండ్రు కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చడానికి హరీష్ రావు, కేటీఆర్ లు మాట్లాడుతున్నారు. పది నెలలు అయినా ఇంకా ఓటమిని వాళ్ళు అంగరీకరించినట్లు కనపడట్లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుండి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబ‌ర్ 7 ఇచ్చింది. 50 మీటర్ల బఫర్ జోన్ లో నా ఇల్లు కూడా పోతుంది. కేసీఆర్ హైదరాబాద్ ను డల్లాస్, లండన్, ఇస్తాంబుల్ చేస్తా అన్నా.. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్లు తాగేలా చేస్తా అన్నడు.. హైదరాబాద్ ను మార్చాలన్న కేసీఆర్ మాటలను మేము స్వాగతిస్తున్నామ‌ని.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ కావాల్సిందే.. మురికి కూపం నుండి పేదలకు విముక్తి కల్పించాల్సిందేన‌న్నారు.

Next Story