రూ.2.25 కోట్లతో కోతులకు పునరావాస కేంద్రం.. ప్రారంభించిన మంత్రి

Minister Indrakaran Reddy Inaugurates Monkey Rehabilitation Center. తెలంగాణ రాష్ట్రంలో తొలి కోతుల సంరక్షణ, పునరావాస

By Medi Samrat  Published on  20 Dec 2020 10:21 AM GMT
రూ.2.25 కోట్లతో కోతులకు పునరావాస కేంద్రం.. ప్రారంభించిన మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ప్రారంభ‌మైంది. ప‌ట్ట‌ణంలోని గండి రామ‌న్న హ‌రిత‌వ‌నంలో రూ.2.25కోట్ల‌తో నిర్మించిన ఈ సంర‌క్ష‌ణ‌-పున‌రావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్, మూషిక జింకల పార్కును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇక్కడ ఏం చేస్తారు?

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్‌ థియేటర్, డాక్టర్స్‌ రెస్ట్‌ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. 2017లో దీని నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.


Next Story